Wednesday, 9 March 2016

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

దేశ భాషలు వేరైనా ,

నీ భాష ఒక్కటే.. అమ్మ భాష.

పేర్లు పెట్టుకున్న ప్రేమలు ఎన్ని ఉన్నా, 

నీ ప్రేమ ఒక్కటే.. మాతృ ప్రేమ. 

మనుషుల్ని మైమరపించే ఒక పాట కడితే,

అది నువు చెప్పే తియ్యని మాట. 


కల్మషం లేని కనులను చూడాలంటే,


నిను దర్శిస్తే చాలు,


ఈ మహా ప్రస్థానంలో పాత్రలు ఎన్ని ఉన్నా,


చివరగా చిరంజీవం అయ్యేది నీదే. 


కాలాన్ని వెనక్కి తోసి పరుగు తీస్తున్నా,


జగతికి జ్ఞానమిచ్చిన ఓ మహిళా ప్రపంచమా,


ఓ స్త్రీ! ఓ దేవత! ఇదిగో నీకు నేను అందిస్తున్న,


మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.



© క్రాంతి కిరణ్ ఏలే 
౯/౩/౧౬
  

No comments:

Post a Comment