కరోన తుం జావోనా,
ఫిర్ మత్ ఆవోనా,
నువ్వు వింటే సరేనా,
లేదంటే చూస్తాం నీ అంతైనా.
బళ్ళు, సదువులు అన్నీ మాయమైనై,
బయట తిర్గనీకె బండ్లూ బందైనై,
ఏం చేస్తే నువ్వు ఇంక ఆగమైతవ్,
మా లోపల ఉండకుండ పరారైతవ్.
చేతులు కడుక్కుంటే ఉండవంట,
ఆ సబ్బులనే నువ్వు కొట్టుక పోతవంట.
మూతికి మాస్కె తొడగాలంట,
అది మాత్రమే నీకు గండమంట.
ఇంట్లుండి తిని పండితే సాలంట,
ఇట్ల చేస్తే నీ బతుకు తెల్లార్తదంట,
బయటకి పోతే ఏడుంటవో తెల్వదంట,
సప్పుడ సేయకుంట మా పెయ్యిల జొర్తవంట.
బియ్యం, పప్పు, ఉప్పులన్నీ,
ఇంకా ఏమైనా అడిగితే అవన్నీ,
సర్కారు పంపుతుంది ఇంటికే,
ఎట్లైనా నువ్వు పోయ్యేదింగ కాటికే.
పక్క పక్కన నిల్చోవద్దంట,
పుసుక్కున దోస్తానాల అలయ్ బలయ్ సెయ్యొద్దంట,
చేతుకు చేతు తాకొద్దంట,
లేదంటే నువ్వు అంటుకుంటవంట.
మా బలమంతా దవాఖానల డాక్టర్లు,
మమ్ములని ఇంట్లుంచి నిల్చుండే పోలీసులు,
ఊరంతా మందు జల్లే అమ్మలు, అయ్యలు,
వీళ్ళుంటే నీకంతా ఇక సెగలు, హడలు.
©ఏలె క్రాంతి కిరణ్
౩౦/౦౪/౨౦౨౦
Super
ReplyDelete