Thursday, 19 November 2015

అమ్మానాన్న

అమ్మానాన్న 

పని చేసీ, చెసీ ,
పలకడానికి ఏ పదాల పంక్తులు లేవు అంటే,
నేను తలచే ఆ తొలి రూపం, 
అచేతనంగా ఉన్న నన్ను అజేయుడను చేసే స్వరూపం, 
మళ్ళీ , మళ్ళీ నా నోట పలికే మంత్రం, 
అమ్మా! నువ్వే మాయమ్మ, 
మా  మమతల కొమ్మ. 

ప్రాణం అనే ఇరుసులో
ఇరుకునపడిన జీవనచట్రం,
కదిలీ, కదిలీ 
ఇక కదలలేను అంటే,
ఆగిన ఆ ఆకలి ధ్యాసను,
తిరిగి గుర్తు చేసి ,
కావాలి అనే ఆ చిన్ని ఆశను,
సాధించాలని అనిపించే కొత్త స్పూర్తి,
మీరే నాన్న, మా మంచి నాన్న. 

© క్రాంతి కిరణ్  ఏలె  
18/11/2015

No comments:

Post a Comment