ఎగరలేని
ఎత్తులను,
ఏకబిగిన
ఎక్కించే,
ఎదురులేని, ఎడతెగని
విశ్వాసం
ఎక్కడిదీ?
అది మన
మనస్సుది
కాదా!
అలుపు లేని
ఈ
సంసార
కెరటాల
పై
ఆహ్లాదంగా
ఆటలాడే,
అలసిపోని
ఆత్మస్థైర్యం
ఎక్కడిదీ?
అది మన
మనస్సుది
కాదా!
దమ్మిడీ
లేని
ఈ
దీనమైన
దీపం
ఆరదు అని,
అధైర్యం
వద్దు
అని
చెప్పేది
ఎవ్వరు?
అది మన
మనస్సు
కాదా!
మన నవనాడులలో
నిద్రాణమైన
లక్ష్యాన్ని
సాధించి, గావించే
ఈ ఎకీకృతనిశ్చయం
ఎక్కడిదీ?
అది మన
మనస్సుది
కాదా!
కరుణ లేని
ఈ
కాలంలో
కికరంయమైన, జీవనకానలో
కదలాడి, మెదలాడి
కావ్యంగా
కవ్వించే
ఆ గెలుపును
చూపించేది
ఎవ్వరు?
అది మన
మనస్సు
కాదా!
సాగాలేని
ఆ
కాలికి,
సాగించే
బ్రతుకుసమరంలో
సాయం చేసే
స్నేహం
ఎవ్వరు?
అది మన
మనస్సు
కాదా!
కదిలించు
నీ
బుద్దిని
ఆత్మవిశ్వాసంతో,
నడిపించు
నీ
పంచేంద్రియాలను
నమక్కంతో,
మన మనస్సు
చెప్పేది
వినదు,
అది పరచిన
ఈ
విశాల
విశ్వాన్ని
చూడు,
విహరించే
ఆ
స్వేఛ్చను,
ఈ ప్రపంచానికి
అంకితం
చెయ్యి,
అది చూపిన
ప్రతి
మలుపు
నీ విజయ
గీతికను
ఆలపించే
పిలుపు,
నువ్వు
కదిపిన
ప్రతి
కదం
చేర్చేను
నిన్ను
కరతాళ
ధ్వనుల
తీరం.
© క్రాంతి కిరణ్ ఏలె
14/11/2015
No comments:
Post a Comment